Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)

Advertiesment
Woman

ఐవీఆర్

, సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (17:06 IST)
ప్రకాశం జిల్లా సింగరాయకొండ నడిరోడ్డుపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను అభ్యర్థిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...
 
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ ఓ స్థలం కొనుగోలు చేసారట. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే కొందరు రౌడీలు వచ్చి దాన్ని గడ్డపారలతో ధ్వంసం చేసారని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనీ, అందువల్ల తనకు చావే శరణ్యమంటూ నడిరోడ్డుపై ఆమె నిరసనకు దిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?