Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు రూ. 6 కోట్లు: హర్యానా సీఎం భారీ నజరానా

స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు రూ. 6 కోట్లు: హర్యానా సీఎం భారీ నజరానా
, శనివారం, 7 ఆగస్టు 2021 (19:35 IST)
ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు రూ. 6 కోట్లు భారీ నజరానాను ప్రకటించారు హర్యానా సీఎం ఖట్టర్. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం నీరజ్ చోప్రాకు రూ .6 కోట్లతో పాటు క్లాస్ I కేటగిరీ ఉద్యోగం ఇవ్వబడుతుందని తెలిపారు.
 
అలాగే పంచకులలో అథ్లెట్ల కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నిర్మిస్తామనీ, అక్కడ అతను కోరుకుంటే అధిపతిగా ఉంటారని తెలిపారు. ఇతర ఆటగాళ్ల మాదిరిగానే అతనికి 50% రాయితీతో ప్లాట్లు ఇవ్వబడతాయన్నారు హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్.
 
కాగా టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. అథ్లెటిక్స్‌లో దేశానికి బంగారు పతకం అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా సూప‌ర్ షో క‌న‌బ‌రిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్య‌ధికంగా 87.58 మీట‌ర్ల దూరం విసిరి అందరికంటే అగ్రపథాన నిలిచాడు. ఫలితంగా అథ్లెటిక్స్‌లో నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని అందించి ఇండియాకు చిరస్మ‌ర‌ణీయ రోజును మిగిల్చాడు.
 
తొలి ప్ర‌య‌త్నంలో అత‌ను 87.03 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అత‌ను మ‌రింత ప‌దునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరాడు. 
 
నిజానికి క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో ఫ‌స్ట్ త్రోతోనే అంద‌రికీ షాకిచ్చాడు. అత‌ని ప‌ర్స‌న‌ల్ బెస్ట్ 88.07 మీట‌ర్లు. దానికి త‌గిన‌ట్లే నీర‌జ్ టోక్యోలో త‌న ప్రతిభను చూపించాడు. ముందు నుంచి ఫెవ‌రేట్‌గా ఉన్న నీర‌జ్‌.. అనుకున్న‌ట్లే దేశానికి బంగారు పతకం అందించాడు. 
 
ఇకపోతే, శనివారం జరిగిన ప్ర‌తి అటెంప్ట్‌లోనూ నీర‌జ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్ర‌తి త్రోలోనూ అత‌ను మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందించాడు. వ‌ద్‌లేచ్ జాకుబ్ 86.67 మీట‌ర్లు, వెస్లీ వెటిస్లేవ్ ల85.44 మీట‌ర్ల దూరం విసిరి సిల్వ‌ర్, బ్రాంజ్ మెడ‌ల్స్ అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోక్యో ఒలింపిక్స్‌‌లో స్వర్ణం: నీరజ్ చోప్రాకు ప్రశంసల వెల్లువ.. బాహుబలితో పోల్చిన..?