ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్రౌండ్ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఇటీవలే స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అయితే 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో నీరజ్ ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది.