భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫిన్‌ల్యాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో తన జావెలిన్‌ను 89.30 మీటర్ల దూరం విసిరి నీరజ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.
గత యేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్‌లో 88.07 మీటర్ల దూరం విసిరి చోప్రా జాతీయ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేశాడు.
తాజాగా జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో నీరజ్ చోప్రా తన ఖాతాలో సిల్వర్ మెడల్ వేసుకున్నాడు. టోక్యో గేమ్స్ తర్వాత నీరజ్ తొలిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఫిన్‌ల్యాండ్ అథ్లెట్ ఒలివర్ హిలాండర్ తన జావెలిన్‌ను 89.83 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాడు.
ఒలింపిక్స్ గేమ్స్ తర్వాత ఇచ్చిన తొలి ప్రదర్శనలోనూ నీరజ్ అద్భుత ప్రదర్శన చూపించాడు. అసాధారణ ప్రతిభను కనబరిచాడు. దాదాపు 90 మీటర్ల మార్క్‌ను అతను టచ్ చేశాడు.
నుర్మి గేమ్స్ తొలి త్రోలో జావెలిన్‌ను 86.92 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో అటెంప్ట్‌లో 89.30 మీటర్ల దూరం విసిరాడు. ఇక ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో అతను ఫౌల్ అయ్యాడు. ఆరవ సారి 85.85 మీటర్ల దూరం విసిరాడు.