Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
, సోమవారం, 20 డిశెంబరు 2021 (17:25 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే మన దేశంలో 153 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే, ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇప్పటికే యూరప్‌లోని పలు దేశాలు మళ్లీ లాక్డౌన్ విధించాయి. దీంతో పెట్టుబడుదారులు రిస్క్ తీసుకోవడం ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో మదుపరులు వారి స్టాకులను అమ్ముకుటూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్ భారీ నష్టాలను చవి చూస్తుంది. 
 
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1189 పాయింట్లను కోల్పోయి 55,822 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 371 తగ్గి 16,614 వద్ద ఆగింది. అలాగే, ట్రేడింగ్ ముగిసే సమయానికి హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ 1.70 శాంతం, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 1.02 శాతం చొప్పున లాభపడగా, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాన్ ఫైనాన్స్ కంపనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక ఓటర్ ఐడీకి ఆధార్ లింక్! ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకించినా బిల్లు