Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రెండింటితో ధూపం వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేస్తుంటారు. కానీ వారివారి సాంప్రదాయాల ప్రకారం వేరువేరు ధూపాలను వేస్తుంటారు. ధూపం వేయడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ధూపం వల్ల ఇంట్లోకి దైవత్వం వస్తుంది. మానసి

Advertiesment
Significance
, గురువారం, 23 నవంబరు 2017 (21:07 IST)
సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేస్తుంటారు. కానీ వారివారి సాంప్రదాయాల ప్రకారం వేరువేరు ధూపాలను వేస్తుంటారు. ధూపం వేయడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ధూపం వల్ల ఇంట్లోకి దైవత్వం వస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. 
 
రోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఇంట్లో అంతా ధూపం ఇవ్వాలి. రోజూ పూజ తరువాత కర్పూర హారతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది. ఇంట్లో ధన నష్టం జరగదు. అలాగే ఇంట్లో నిప్పులు కాల్చి వాటిపైన గుగ్గుల్ పెట్టాలి. దీని సువాసన వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో మానసిక రోగులు ఉంటే వారికి నయం అవుతుంది. గుగ్గుల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది.
 
గోవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను కాల్చి దానిమీద పసుపు రంగు ఆవాలు వేసి ధూపం ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఉండి, డబ్బులు నిలవకపోతే అగర్‌బత్తీ ధూపం ఇవ్వాలి. కాళీ మాత ముందు అగర్‌బత్తీ వేయాలి. ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పూజ చేసి అగర్‌బత్తీతో వెలిగించాలి. ఇలా చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. వేపాకుతో ధూపం వేస్తే చాలా మంచిది.. వాస్తు దోషాలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌