Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌

ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ప్రభుత్వం. ఇప్పుడు శ్రీవారి దర్శించుకునేందుకు కూడా ఆధార్ తప్పదంటోంది టీటీడీ. ఈ విధానం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌
, గురువారం, 23 నవంబరు 2017 (09:08 IST)
ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ప్రభుత్వం. ఇప్పుడు శ్రీవారి దర్శించుకునేందుకు కూడా ఆధార్ తప్పదంటోంది టీటీడీ. ఈ విధానం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. 
 
సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు తితిదే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు. టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తితిదే అధికారులు తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం దినఫలాలు : ధనం ఎంత వచ్చినా నిలబెట్టుకోలేరు