Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిబాబా ఎందుకు ఉపవాసం వద్దన్నారు?

సాయిబాబా ఎందుకు ఉపవాసం వద్దన్నారు?
, గురువారం, 30 జనవరి 2020 (21:05 IST)
బాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు. ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుజ దోషం వున్న జాతకులు ఏం చేయాలో తెలుసా? (video)