Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

ప్రజలకు వెల్లువెత్తుతున్న క్రిస్మస్ శుభాకాంక్షలు..

Advertiesment
Merry Christmas 2019: Wishes
, బుధవారం, 25 డిశెంబరు 2019 (11:06 IST)
క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.
 
ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా క్రిస్మస్‌ పండగ జరుపుకొంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ పండగను ఆనందంగా జరుపుకొని సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని చెప్పారు.
 
మరోవైపు టాలీవుడ్ స్టార్స్ త‌మ అభిమానుల‌కి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అలానే కొంద‌రు మూవీ పోస్ట‌ర్స్ ద్వారా త‌మ శుభాకాంక్ష‌ల‌ని తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్‌, దేవి శ్రీ ప్ర‌సాద్‌, కార్తీ, అమ‌ల‌, సుధీర్ బాబు త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి పండగ విషెస్ అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#మెర్రీ క్రిస్మస్.. 80 మంది ఉగ్రమూకల హతం.. పశ్చిమ ఆఫ్రికాలో నరమేధం