Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే పళ్ళెంలో భార్యతో కలిసి భోజనం చేస్తే? (video)

Advertiesment
ఒకే పళ్ళెంలో భార్యతో కలిసి భోజనం చేస్తే? (video)
, బుధవారం, 4 డిశెంబరు 2019 (21:41 IST)
స్త్రీలను గౌరవించనిచోట ఎన్ని సత్కార్యాలు జరిగినా అన్నీవ్యర్ధాలే. స్త్రీలు పూజింపబడుచోట, గౌరవింపబడుచోట దేవతలు విహరిస్తుంటారు. కావున అందరు స్త్రీలను గౌరవించి తీరవలెను. తల్లిదండ్రులచేత, సోదరులచేత, భర్తలచేత, మరుదులచేత స్త్రీలు పూజింపదగినవారు. శుభమును కోరువారంతా స్త్రీలను పూజించి, భూషణములిచ్చి సంతృప్తి పరచవలెను. 
 
అక్కచెల్లెలను పూజించకుండిన చీరలు, సారెలు పెట్టి గౌరవించనివారిని వారు శాపము పెట్టుదురు. ఆ శాపానికి గురైనవారు నశిస్తారు. దంపతులు కలసిమెలసి సంతోషంగా ఉండవలెను. గృహస్థధర్మాలు ఆచరించవలెను. స్త్రీలకు పాతివ్రత్యం, పురుషులకు ఏకపత్నీత్వ ధర్మము ప్రధానమైనవి. అనుకూల దాంపత్యమున్నప్పుడే ఆ ఇంటిలో సమస్త శుభములు కలుగుచుండును.
 
గృహస్థుడు తెల్లనివి, అంచులుండే వస్త్రములనే ధరింపవలెను. నిరంతరం పరిశుభ్రంగా ఉండవలె. కారణము లేకుండా గడ్డమును మీసమును గోళ్ళను పెరగనీయకూడదు. ఉదయించే సూర్యుణ్ణి, అస్తమించే సూర్యుణ్ణి చూడకూడదు అలా చూసినట్లైతే కనుచూపు మందగించి దృష్టిదోషం కలుగుతుంది. గ్రహణం పట్టినప్పుడు సూర్యున్ని చూడకూడదు. మిట్టమధ్యాహ్నం పూట సూర్యుణ్ణి చూడకూడదు.
 
దూడను కట్టిన త్రాటిని దాటరాదు. వానలో పరుగెత్తరాదు. నీటిలోతన ప్రతిబింబాన్ని చూచుకోరాదు. దానివల్ల ఆయువు తగ్గిపోయి, బుద్ధి నశించి, తేజస్సు తొలగి, బలం క్షీణించి, చూపు పోతుంది. భార్యతో కలిసి ఒకేబంతిలో, ఒకేపళ్ళెంలో భుజించరాదు. భార్య భుజించేటప్పుడు ఆవులించేటప్పుడు, తుమ్మినప్పుడు, విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆమెను చూడరాదు. పైన బట్టలేకుండా భుజింపరాదు. దిగంబరులై స్నానం చేయరాదు. నగ్నంగా నిద్రపోరాదు.
 
నలుగురు నడిచే దారిలో, బూడిదలో, గోశాలలో, దున్నిన పొలాల్లో, పాడుబడినగదిలో, పుట్టలో, పురుగుపుట్ర ఉండేచోట్లలో, బొరియల్లో, నదీతీరాల్లో మలమూత్రాలు విడువరాదు. అగ్నిని, బ్రాహ్మణుని, గాలిచే కదిలే చెట్లను, సూర్యుణ్ణి, నీటిని, ఆవులను చూస్తూ మలమూత్రాలను విడిచినట్లైతే బుద్ధి నశిస్తుంది. ప్రయాణం చేస్తున్నపుడు దేవతావిగ్రహము, ఆవు, త్రవ్వి కుప్పవేయబడిన మన్ను (మంటికుప్ప), బ్రాహ్మణుడు, నేయి, తేనె, దేవతావృక్షాలు, గురువులు, సాధువులు, సత్పురుషులు కనిపించిన ప్రదక్షిణము చేయవలె.
 
నిప్పును నోటితో ఊదకూడదు. అమేథ్యాన్ని అగ్నిలో వేయకూడదు. కాళ్ళను నిప్పుతో కాచరాదు. మంచం క్రింద నిప్పులకుంపటి పెట్టకూడదు. నిప్పును దాటరాదు. ప్రాణంపైకి వచ్చే పనిచేయరాదు. ప్రాతఃసంధ్యాసాయంకాలాల్లో ఏ ఆహారాన్ని భుజింపరాదు. ఎక్కడికి వెళ్ళకూడదు. తనమెడలోని పూలదండను తానే తీయరాదు. ఎవరితోనైనను తీయించుకొనవలెను. పాడుబడిన ఇంటిలో ఒక్కరే నిద్రించవద్దు. నిద్రబోతున్నవారిని లేపకూడదు. ఆవుదూడ పాలు తాగేటప్పుడు అడ్డకోకూడదు. ఆకాశంలో ఇంద్రధనుస్సును చూసి ఇంకొకరికి చూపరాదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-12-2019 బుధవారం దినఫలాలు - మీ రాక బంధువులకు...