Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-12-2019 బుధవారం దినఫలాలు - మీ రాక బంధువులకు...

Advertiesment
04-12-2019 బుధవారం దినఫలాలు - మీ రాక బంధువులకు...
, బుధవారం, 4 డిశెంబరు 2019 (05:30 IST)
మేషం : మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమరుపాటుకూడదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. 
 
వృషభం : పత్రిక ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. హామీలు, చెక్కుల జారీలో పునరాలోచన మంచిది. కొన్ని వ్యవహారాలు సానుకూలతకు ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు. 
 
మిథునం : ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు లేదా ఒక ముఖ్య సమాచారం అందుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పత్రిక ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. స్త్రీలు గృహాలంకరణల పట్ల ఆసక్తి కనపరుస్తారు. 
 
సింహం : ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. దుబారా ఖర్చులు అధికం. వ్యవసాయ కూలీలకు, వృత్తుల వారికి ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉన్నా సంతృప్తి. ప్రయోజనం పొందుతారు. 
 
కన్య : నూతన వ్యాపారాలకు కావలిసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లుకు, ఇళ్ళస్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, బహుమతులు అందించి వారి ప్రాపకం సంపాదిస్తారు. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కోకక తప్పదు. ప్రయాణాలలోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత, మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
ధనస్సు : రుణ యత్నాల్లో ఆటంకాలు. ధనం సకాలంలో అందకపోవడం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదాపడతాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. ఉపాధ్యాయులకు, వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. 
 
మకరం : క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. హామీల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం : విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పువు. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
మీనం : మీ అభిప్రాయాలను బయట వ్యక్తం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడును. నూతన పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు తమ బంధు వర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం (03-12-2019) మీ రాశిఫలాలు - స్త్రీలపై చుట్టుపక్కల వారి...