Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (03-12-2019) మీ రాశిఫలాలు - స్త్రీలపై చుట్టుపక్కల వారి...

Advertiesment
మంగళవారం (03-12-2019) మీ రాశిఫలాలు -  స్త్రీలపై చుట్టుపక్కల వారి...
, మంగళవారం, 3 డిశెంబరు 2019 (09:12 IST)
మేషం : వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడతారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియజేయకండి.
 
వృషభం : స్త్రీలపై చుట్టుపక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ యత్నాలకు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విజయం మిమ్మలను వరిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు.
 
కర్కాటకం : మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడుతారు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైన పట్టుదలతో పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
సింహం : ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచింది. సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహానికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
కన్య : ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలు నరాలు, పొట్ట, కాళ్ళకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు.
 
తుల : ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
వృశ్చికం : ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగుపడకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిందని గమనించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచింది. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు.
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాల్లోనూ ప్రయాణాలలోనూ మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం అందుతుంది.
 
మకరం : కుటుంబీకుల మధ్య చిన్నచిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు.
 
కుంభం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు అర్జనల పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థకు లోనవుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం : ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలిసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి వద్ద ఆ దిశ పల్లముగా వుంటే ఏమవుతుంది?