Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రితో విరోధమా? ఆదిత్యుడిని పూజిస్తే...

తండ్రితో మీకు విరోధమా...? అయితే ఆలోచించకండి. తప్పకుండా మీకు సూర్య దోషం ఉన్నట్లే లెక్క. సూర్యుడు పితృకారక గ్రహము. కనుక తండ్రితో తరచూ విరోధములు తలెత్తుతున్నట్లయితే సూర్య దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి. దీనితోపాటు చేపట్టిన పనులు ఎదురుతిరగడం, గుండె జబ్బులు వ

Advertiesment
తండ్రితో విరోధమా? ఆదిత్యుడిని పూజిస్తే...
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (21:04 IST)
తండ్రితో మీకు విరోధమా...? అయితే ఆలోచించకండి. తప్పకుండా మీకు సూర్య దోషం ఉన్నట్లే లెక్క. సూర్యుడు పితృకారక గ్రహము. కనుక తండ్రితో తరచూ విరోధములు తలెత్తుతున్నట్లయితే సూర్య దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి. దీనితోపాటు చేపట్టిన పనులు ఎదురుతిరగడం, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లయితే రవిదోషంగా గుర్తించాలి. 
 
సూర్య దోషం నుంచి బయటపడాలంటే... సూర్య ధ్యానంతోపాటు సూర్య యంత్రాన్ని ధరించాలి. 
ముందుగా సూర్య ధ్యానం శ్లోకాన్ని చూద్దాం...
 
"ప్రత్యక్షదేవం విశదం సహస్ర మరీచి భీశ్శోభిత భూమి దేవమ్
సప్తాశ్వగం సద్వృత్తహస్తమాద్యం భజేహం మిహిరం హృదబ్జే
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్"
 
అంటూ సూర్య ధ్యానాన్ని ఆచరించాలి. ఇక సూర్య యంత్రం ధరించడానికి గాను... ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఈ యంత్రాన్ని ధరించాలి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత శుచిగా సూర్య ధ్యానాన్ని 12సార్లు చేసి, మంత్ర జపం 108సార్లు జపించి... "ఓం హ్రీం శ్రీం అం గ్రహాధి రాజాయ ఆదిత్యాయ స్వాహా" అంటూ యంత్రాన్ని ధరించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇలా వెళ్ళి అలా వచ్చెయ్యవచ్చు...