Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగిస్తే..? (Video)

Advertiesment
Calotropis gigantea
, సోమవారం, 13 జనవరి 2020 (13:13 IST)
తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్పనూనె కలిపి ఐదు దీపాలు సిద్ధం చేసుకుని ఐదువారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. 
 
తెల్ల జిల్లేడు పువ్వులతో శివపూజ, ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకొచ్చి ఇంట నాటడానికి ఆదివారం, గురువారంలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది.
 
శ్వేతార్కం అంటే తెల్లజిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఈ జిల్లేడు ఇంట వుండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు వుండవు. ధనధాన్య సమృద్ధి వుంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
 
 
ఇంకా విద్యార్ధులు రాణిస్తారు. సర్వకార్యాలు జయప్రదం అవుతాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున "పుష్యార్కయోగం" వుంటుంది. ఆ సమయంలో శ్వేతార్కాన్ని నాటడం చేయొచ్చునని, పూజ కూడా చేయొచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
తెల్ల జిల్లేడు ను స్వేతార్క మూలంగా సంబోదిస్తూ ఇందులో విజ్ఞాలు తొలగించే వినాయకుడు నివశిస్తాడని మన పెద్దలు చెబుతుంటారు. ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభలు తెలుసుకోండి.. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. 
 
ఇంట్లో ప్రశాంతంగా లేదనీ, ఎప్పుడూ ఏవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకున్నవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తున్నామో, అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు. జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్లలో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్మకం. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-01-2020 సోమవారం మీ రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించినా జయం