Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-01-2020 సోమవారం మీ రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించినా జయం

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 13 జనవరి 2020 (04:30 IST)
మేషం : రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత ఆందోళన తప్పదు. నూతన వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. చేపట్టిన పనులలో ఏకాగ్రత అంతంగా ఉండదు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. 
 
వృషభ : చిట్స్, పైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
మిథునం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు తప్పుదు. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. స్థల వివాదాలాు, కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కివస్తాయి. మొక్కుబడులు తీర్చుకుంటారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సామాన్యం. కొంతమంది మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. 
 
కర్కాటకం : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. ప్రేమికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
సింహం : తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఒక విషయంలో బంధు మిత్రులు మిమ్మలను మొహమాటపెట్టే ఆస్కారం ఉంది. స్త్రీలు, నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. చేతివృత్తుల వారికి సామాన్యం. 
 
కన్య : ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పెట్టే ఆస్కారం ఉంది. విద్యార్థులు, క్రీడలు, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. కళ, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. 
 
తుల : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ దృక్పథం బలపడుతుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం : ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు, వ్యవహారాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మిత్రుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులు, ఆశిస్తున్న అవకాశాలు కోసం గట్టిగా యత్నాలు చేయవలసి ఉంటుంది. 
 
ధనస్సు : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారం కాగలవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. దైవారాధనపట్ల ఆశక్తి పెరుగుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
మకరం : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు, అవసరాలు అధికంగా ఉంటాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. గృహంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. 
 
కుంభం : ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. హోటల్, కేటిరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
మీనం : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-01-2020 ఆదివారం మీ రాశిఫలాలు - ఆదిత్య హృదయం వింటే..