Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-01-2020 ఆదివారం మీ రాశిఫలాలు - ఆదిత్య హృదయం వింటే..

Advertiesment
12-01-2020 ఆదివారం మీ రాశిఫలాలు - ఆదిత్య హృదయం వింటే..
, ఆదివారం, 12 జనవరి 2020 (05:00 IST)
మేషం : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, తమలపాకులు, చిరు వ్యాపారులకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, మెడికల్ క్లయింలు మంజూరవుతాయి. 
 
వృషభం : ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి కొత్త సమాచారం అందుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వింటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. తీర్థయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి కలుగుతుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు ప్రకటనలు, స్కీంలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. 
 
సింహం : ఓర్పు, శ్రమాధిక్యతతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
కన్య : ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. మీలో నెలకొన్న అశాంతి, చికాకులు తొలగిపోతాయి. 
 
తుల : ఆదాయానికి మించి ఖర్చులు, విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణాలలో చికాకులు తప్పవు. 
 
వృశ్చికం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. ఒక నష్టం మరో విధంగా సర్దుబాటు కాగలదు. ఉద్యోగస్తులకు అధికారులతో సాన్నిత్యం బలపడుతుంది. 
 
ధనస్సు : కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. 
 
మకరం : ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రైవేట్, పైనాన్సుల్లో పొదుపు. వ్యక్తులకు రుణాలు క్షేమం కాదు. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. 
 
కుంభం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. రుణం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సమన్వయం లోపిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారేకానీ సహకరించేవారుండరు. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. 
 
మీనం : ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. బెట్టింగులు, జూదాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడలోనే రుద్రాక్షలు ధరించాలట.. ఎందుకంటే?