Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబరు 16 నుంచి 22 వరకూ మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, సింహంలో రవి, బుధులు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలో చంద్రుడు. 17వ రవి, 18న బుధుడు కన్య ప్రవేశం. 20న సర్వ ఏకాదశి, 21న వామన జయంతి, 22న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు

Advertiesment
సెప్టెంబరు 16 నుంచి 22 వరకూ మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (21:03 IST)
కర్కాటకంలో రాహువు, సింహంలో రవి, బుధులు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలో చంద్రుడు. 17వ రవి, 18న బుధుడు కన్య ప్రవేశం. 20న సర్వ ఏకాదశి, 21న వామన జయంతి, 22న శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటు నిర్ణయం తగదు. ధననష్టం, శ్రమ అధికం. మీ శ్రీమతి సలహా పాటించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు సామాన్యం. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు సానూకూలమవుతాయి. పదువుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు అదనపు బాధ్యతలు విశ్రాంతి లోపం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎవరినీ నొప్పించవద్దు. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, గురు వారాల్లో ఊహించన సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. పదపుల కోసం ఆరాటపడవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెద్దమెుత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో సరిదిద్దుకుంటారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిస్థితుల అనుకూలత ఉంది. ఉత్సాహంగా గడుపుతారు. మెుండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. అనేక పనులతో సతమతమవుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పదవులు, బాధ్యతల స్వీకరణకు అనుకూలం. తొందరపడి హామీలివ్వవద్దు. మంగళ, శని వారాల్లో మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయడం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం ఆభరణఆలు, పత్రాలు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు నిదానంగా సత్పలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. దైవకార్యంలో పాల్గొంటారు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. శనివారం నాడు ఒత్తిడి, ఆందోళన అధికం. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయడం. ఉద్యోగ ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహారానుకూలతకు మరింతగా శ్రమించాలి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థికస్థితి సామాన్యం. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. పూర్య విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ వారం ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. ప్రతిభఖు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. సంతానం మెుండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉపాది పథకాలు సామాన్యంగా సాగుతాయి. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువుల, పత్రాలు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. పదవులు, బాధ్యతులు స్వీకరిస్తారు. ఖర్చులకు అంతుండదు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పర్మిట్లు, లైసెన్సుల అలక్ష్యం తగదు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గృహంలో మార్పచేర్పులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మంగళ, బుధ వారాల్లో కొన్ని సంఘటనలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ధనమూలక సమస్యలెదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అర్ధాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ ప్రకటనలు విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గురు, శుక్ర వారాల్లో ప్రతికూలతలు అధికం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పనులు మెుండిగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వారితో జాగ్రత్త. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఒతిళ్లకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పంతాలు, పట్టులకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్థికస్థితి పర్వాలేదనిపిస్తుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. బంధువులతో విభేదిస్తారు. శనివారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీలకు లజ్జ, వినమ్రతలే భూషణములు... పెద్దల సూక్తులు...