Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలకు లజ్జ, వినమ్రతలే భూషణములు... పెద్దల సూక్తులు...

1. రోజులోని 24 గంటలను సక్రమంగా, ప్రణాళికాబద్దంగా వినియోగించుకోవాలి. సుఖదుఃఖాలలో ఒకే రీతిలో ఉండాలి. 2. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్నిమార్పులు అవసరమే. కాని మన సనాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మరువకూడదు. వాటిని పరిరక్షించుకోవాలి.

Advertiesment
స్త్రీలకు లజ్జ, వినమ్రతలే భూషణములు... పెద్దల సూక్తులు...
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (16:48 IST)
1. రోజులోని 24 గంటలను సక్రమంగా, ప్రణాళికాబద్దంగా వినియోగించుకోవాలి. సుఖదుఃఖాలలో ఒకే రీతిలో ఉండాలి. 
 
2. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్నిమార్పులు అవసరమే. కాని మన సనాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మరువకూడదు. వాటిని పరిరక్షించుకోవాలి.
 
3. స్త్రీలకు లజ్జ, వినమ్రతలే భూషణములు. స్త్రీలు అవసరమైన చోట ధైర్య సాహసాలతో వ్యవహరించి, ప్రమాదాలను, దుర్మార్గాలను అరికట్టాలి. జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనల యెడల ఆశావహ దృక్పధం కలిగి ఉండాలి.
 
4. మనస్సు మన స్వాధీనంలో ఉంటే అన్నీ మనకు స్వాధీనమవుతాయి. ప్రచారం గురించి, పేరుప్రఖ్యాతుల గురించి ఆరాటపడకు. పూవుకు తావి లాగా రావలసిన సమయంలో అవి వస్తాయి. 
 
5. ఏ పరిస్థితులలోను మనోనిబ్బరాన్ని కోల్పోకూడదు. విభిన్న పరిసరాలు, పరిస్ధితుల మధ్య సమతుల్యం కలిగి ఉండాలి.
 
6. ఎవరినుంచీ ఏమీ ఆశించకుండా ఉంటే అందరినీ సమంగా ప్రేమించవచ్చు. నీకు కావలసినవన్నీ అపుడు వాటంతట అవే వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-09-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. మెతకదనం వీడి..?