పూజలు చేస్తున్నట్లుగా కల వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

ఏదైనా కల వచ్చినప్పుడు మరునాడు ఉదయాన్నే ఆ కల గురించి కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ చెబుతుంటారు. ఆ కల ఆనందాన్ని కలిగించేది అయితే సాధ్యమైనంత వరకు త్వరగా నిజం కావాలని కోరుకుంటారు. అదే కల బాధని, భ

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:03 IST)
ఏదైనా కల వచ్చినప్పుడు మరునాడు ఉదయాన్నే ఆ కల గురించి కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ చెబుతుంటారు. ఆ కల ఆనందాన్ని కలిగించేది అయితే సాధ్యమైనంత వరకు త్వరగా నిజం కావాలని కోరుకుంటారు. అదే కల బాధని, భయాన్ని కలిగించేది అయితే నిజమవుతుందోనని ఆందోళన చెందుతుంటారు.
 
సాధారణంగా కలలు మానసిక పరిస్థితికి తగినట్లుగా వస్తుంటాయి. అటువంటి కలల ఫలితాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సహజంగా కలలు తెల్లవారు ఝామున వచ్చినట్లైతే ఆ కల నిజమవుతుందని చెప్తుతుంటారు. కలలో కనిపించే దృశ్యాలను బట్టి వాటి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొంతమందికి పూజలు చేస్తున్నట్లుగా కలలు వస్తుంటాయి. 
 
అలా వచ్చిన కలలు శుభ సూచకమేనని శాస్త్రంలో చెప్తుతున్నారు. ఇలాంటి కల రావడం వలన జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని పురాణాలలో చెబుతున్నారు. కనుక ఎప్పుడైనా పూజ చేస్తున్నట్లుగా కల వస్తే దాని గురించి ఆందోళన చెందకుండా ఆనందంగా ఉండవచ్చును. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బుధవారం (12-09-2018) దినఫలాలు - చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల...