Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 13-10-17

మేషం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధిపథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానం అందుతాయి. పత్రికా, మీడియా రంగాల వారికి చికాకులు అధికం

Advertiesment
daily prediction
, శుక్రవారం, 13 అక్టోబరు 2017 (05:41 IST)
మేషం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధిపథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానం అందుతాయి. పత్రికా, మీడియా రంగాల వారికి చికాకులు అధికం. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు.
 
వృషభం : కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధాలు రావచ్చు. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తpప్పదు. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఆగ్రహావేశాలను అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం: మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏదో సాధించలేకపోయామనే భావన మిమ్మల్ని వెంటాడుతుంది. బంధుమిత్రులతో పట్టింపులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహరాల్లో మెళకువ అవసరం.
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నిరాశతప్పదు.
 
సింహం: కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం వుంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. ప్రముఖులను, ఆత్మీయులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యావిషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది.
 
కన్య: భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీకు కావలసిన వస్తువు లేక పత్రాలు కనిపించకుండా పోయే ఆస్కారం వుంది.
 
తుల: విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. అందరితో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
వృశ్చికం : రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. మీరంటే పడని వ్యక్తులు మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. దూర ప్రయాణాల్లో ఏకాగ్రత చాలా అవసరం. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు: సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మకరం: ఆరోగ్యంలో స్వల్ప చికాకులు వుంటాయి. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్రముఖులను కలుసుకుంటారు.  చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.
 
కుంభం: మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. విలువైన పత్రాలు, రసీదులు అందుకుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. సన్నిహితులను, బంధువులను కలుసుకుంటారు.
 
మీనం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి వుంటుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి వచ్చేస్తోంది... దీపాలు ఎలా పెట్టాలో తెలుసా?