శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-10-17

మేషం : కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. అకాల భోజనం, మితిమీరిన శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఇతరాత్రా సమస్యలు అధికం. ఒక వ్యవ

మంగళవారం, 10 అక్టోబరు 2017 (05:46 IST)
మేషం : కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. అకాల భోజనం, మితిమీరిన శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఇతరాత్రా సమస్యలు అధికం. ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృషభం : వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మిథునం : మీ విరోధులు వేసే పథకాలు తిప్పికొట్టగలుగుతారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త పథకాలు రూపొందిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
కర్కాటకం : ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిదికాదు. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలలో చికాకులు తప్పవు.
 
సింహం : కొన్ని విషయాలను చూసీచూడనట్టుగా వదిలివేయాలి. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత మెలకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకితభావంతో పని చేయవలసి ఉంటుంది.
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దలతో ఏకీభవించలేరు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి ఉంటుంది. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి.
 
తులం : కళ, సాంస్కృతిక, క్రీడా రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. ప్రిటింగ్ స్టేషనరీ రంగాల వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు.
 
వృశ్చికం : దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. బంధు మిత్రులతో ఏకీభవించలేకపోతారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు : ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలమైన కాలం. మీ లక్ష్య సిద్ధికి నిరంతరం కృషి పట్టుదల అవసరమని గమనించండి. ఆధ్యాత్మిక చింతన, వ్యాపకాలు పెరుగుతాయి.
 
మకరం : కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అయినవారి సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు ఎదుర్కొంటారు.
 
కుంభం : ఆర్థిక కుటుంబ విషయాల పట్ల దృష్టిసాగిస్తారు. బంధుమిత్రులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయనపుడు పునరాలోచన చాలా అవసరం. మీ కళత్ర మొండివైఖరి వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం : కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చు. జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చనిపోయిన ఆత్మీయులు కలలోకి వస్తే...?