Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-10-17

మేషం: వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల అసహనానికి లోనవుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహ

Advertiesment
daily prediction
, సోమవారం, 9 అక్టోబరు 2017 (05:41 IST)
మేషం: వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల అసహనానికి లోనవుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
వృషభం : భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. 
 
మిథునం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళకువ అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు.
 
కర్కాటకం: చేపట్టిన స్వయం ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగటంతో పాటు మీ యత్నం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వైద్యులకు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. 
 
సింహం: కళా సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసివస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కొంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
కన్య: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్థిర, చరాస్తుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల: వ్యాపారాల్లో పోటీ. షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉల్లాసంగా సాగుతాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
వృశ్చికం : పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
 
మకరం: ఉద్యోగస్తులకు ఫై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యతలను ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఏకీభవించలేకపోతారు.
 
కుంభం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మాట్లాడలేని చోట మౌనం వహించండి మంచిది.
 
మీనం: రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో మెలకువ అవసరం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 08-10-17