Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 06-10-17

మేషం: కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ కళత్ర ఆరోగ్యంలో

Advertiesment
daily prediction
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (05:57 IST)
మేషం: కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఆశాభావంతో ఉద్యోగయత్నం సాగించండి.
 
వృషభం: సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్మలను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి.
 
మిథునం: బంధు మిత్రుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మిత్రుల సాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
సింహం: ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.
 
కన్య : రుణం ఏ కొంతైనా తీర్చటానికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి.
 
తుల: స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం ఖర్చు చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అలవాట్లు, మాటతీరు మార్చుకోవడం మంచిది. ట్ర్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రాంతం నుంచి మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది.
 
ధనస్సు: రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది.
 
మకరం: లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడుతాయి.
 
కుంభం: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం.
 
మీనం: సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 05-10-17