ఆదివారం పూట వెలిగించే దీపంతో సకల దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ దీపం గురించి తెలుసుకుందాం. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం.. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలో వున్నవారు ఆదివారం పూట ఆవనూనెతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ఆదివారం పూట ఆవనూనెతో ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఆ ఇంట ప్రశాంతత, సంపద చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈతిబాధలు వుండవు. రుణబాధలు వుండవు. ఇంట్లో ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
అలాగే ఆదివారం పూట ఆవనూనె దీపాన్ని ఇంటికి ప్రధాన ద్వారం వద్ద వెలిగించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంకా వాస్తు దోషాలచే ఏర్పడే ఈతిబాధలు పటాపంచలవుతాయి. ఇంకా శుభ ఫలితాలు చేకూరుతాయి. వ్యాధులు దరిచేరవు.
అంతేకాకుండా ఆదివారం ఆవనూనెతో రావిచెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఆదివారం పూట ఈశాన్య దిక్కున, రావిచెట్టు కింద దీపం వెలిగించడం శుభకరమని, మంగళప్రదమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే శని దేవుడి ఆరాధనలో ఆవ నూనె ముఖ్యమైనది. ఆవనూనె అనేది శని దేవుడితో ముడిపడి ఉన్న పవిత్రమైన నైవేద్యం. దీని ముదురు రంగు వినయం, ఒకరి లోపాలను అంగీకరించడాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలు శని దేవుడి సారాంశంతో లోతుగా ప్రతిధ్వనిస్తాయి. ఈ నూనె ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని, నిష్ఫలం చేస్తుందని నమ్ముతారు. అందుకే శనివారం పూట ఆవనూనెతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.