Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Astami on Sunday : ఆదివారం వచ్చే అష్టమి ఏం చేయాలంటే?

Astami

సెల్వి

, శనివారం, 7 డిశెంబరు 2024 (23:00 IST)
ఆదివారం వచ్చే అష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి. కాలభైరవునికి ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.  ఈ రోజున దానధర్మాలు చేయడం, పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం. ఈ రోజున కాలభైరవుడి ఆలయాన్ని భక్తులు సందర్శించాలి. ఉపవాసం ఉండి, భగవంతుని ప్రార్ధనలు చేస్తారు. 
 
కాలభైరవుడు శివుని ఉగ్రరూపం. కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఈ క్రూరమైన రూపం అజ్ఞానం, చెడు, అహంకారం నాశనాన్ని సూచిస్తుంది. కాల భైరవుడు భక్తులకు రక్షకుడు. కామం, కోపం, దురాశ, అహంకారం వంటి ఐదు రకాల చెడు అంశాలను తొలగిస్తాడు. కాల భైరవుడిని అత్యంత భక్తితో, పవిత్రతతో పూజించేవారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శత్రువులు, దుష్టశక్తుల నుండి రక్షణ ఇస్తాడు. 
 
భక్తులను మంత్రతంత్రాల నుండి కూడా రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి ఎలాంటి ప్రతికూలతతో బాధపడేవారు తప్పక కాలభైరవుడిని పూజించాలి. అష్టమి ఆదివారం లేదా మంగళవారం వచ్చినప్పుడు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి.
 
కాలాష్టమి శివ అనుచరులకు ముఖ్యమైన రోజు. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి పొద్దున్నే స్నానాలు చేస్తారు. వారు కాల భైరవుని దైవిక ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు సాయంత్రం పూట కాలభైరవుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
 
ఈ అష్టమి రోజున ఉదయం పూట పితరులకు ప్రత్యేక పూజలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. కాల భైరవ కథను పఠించడం, శివునికి అంకితమైన మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
 
 కుక్కలకు పాలు, పెరుగు, స్వీట్లు అందజేస్తారు.
 
 కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో బ్రాహ్మణులకు ఆహారం అందించడం అత్యంత ప్రతిఫలంగా పరిగణించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Weekly Horoscope for All Zodiac Signs 08-12-2024 నుంచి 14-12-2024 వరకు వార ఫలితాలు