Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-08-2020 గురువారం దినఫలాలు - బాబాను దర్శించి ఆరాధిస్తే... (video)

Advertiesment
27-08-2020 గురువారం దినఫలాలు - బాబాను దర్శించి ఆరాధిస్తే... (video)
, గురువారం, 27 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి నుంచి సహాయం లభించికపోవడంతో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరాత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
వృషభం : చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది. కార్మికులకు కృషికి తగిన ప్రతిఫలం కానరాగలదు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధి నిర్వహణలో ఏకాగ్రతతో వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యుల నుంచి అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. 
 
మిథునం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం కాగలవు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడటంతో కొంత నిరుత్సాహం చోటుచేసుకుంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. 
 
సింహం : ఉద్యోగస్తులు తోటివారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. రుణాలు తీరుస్తారు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం వల్ల ఆందోళన తప్పదు.
 
కన్య : ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. గృహంలో ఏదైనా శుభకార్యం నిమిత్తం చేసే కృషి వాయిదా పడుతుంది. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు ఆస్కారం ఉంది. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమరుపాటుతనం కూడదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
తుల : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యవసాయ తోటల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరించ బలపడతాయి. అనుకోని ఖర్చులు, సమయానికి ధనం అందకపోవడం వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. 
 
ధనస్సు : ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత  ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మందులు, ఫ్యాన్సీ, ఆల్కహాల్, కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
మకరం : హోటల్, తినుబండరాలు, క్యాటిరింగ్ పనివారలకు పురోభివృద్ధి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీల మనోవాంఛలు నెరవేరడంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు ఆలోచనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడవలసివస్తుంది. 
 
కుంభం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన తప్పదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
మీనం : స్త్రీలకు పనివారలు, చుట్టుపక్కల వారితో చికాకులు తప్పవు. గృహం ఏర్పరచుకోవాలనే మీ కోరిక త్వరలోనే ఒక కొలిక్కి రాగలదు. మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కాగలదు. ముఖ్యులలో ఒకరిగురించి అప్రియమైన సమాచారం అందుతుంది. కుటుంబీకులకు ఆరోగ్యం, కోరికలకు అత్యంత ప్రాధ్యాన్యం ఇస్తారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం.. శుక్లపక్షం.. అష్టమి.. శుభకార్యాలను మొదలెట్టడం..? (video)