Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-08-2020 మంగళవారం దినఫలాలు - శివారాధన చేస్తే...

Advertiesment
25-08-2020 మంగళవారం దినఫలాలు - శివారాధన చేస్తే...
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సమయానికి సహకరించని మిత్రులతీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణయత్నాలు, విదేశీయానం అనుకూలిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. సత్కాలం ఆసన్నమైంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. కొంత మంది మీ సాన్నిత్యం కోరుకుంటారు. 
 
వృషభం : మీ మాటకు కుటుంబంలోనూ, సంఘంలోనూ గౌరవం ఏర్పడుతుంది. మీ సంతానం వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగ యత్నాలు, మార్పులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అనుకోకుండా వసూలవుతుంది. 
 
మిథునం : స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒక మఖ్య సమాచారం అందుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులు మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
కర్కాటకం : శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు శుభదాయకం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వాదోపవాదాలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు గుర్తింపు, ఆర్థిక లబ్ధి వంటి శుభపరిణామాలు ఉంటాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. 
 
కన్య : నూతన వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలు అనుకూలిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు శుభదాకయం. రావలసిన ధనం చేతికందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
తుల : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పొగడ్తలు, హామీలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి ఆశాజనకం. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు అధికమవుతాయి. 
 
వృశ్చికం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. వాహన చోదకులకు చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లు అసాధ్యమనుకున్న టెండర్లు చేజిక్కించుకుంటారు. 
 
ధనస్సు : ఆపరేషన్లు చేయునపుడు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యార్థులకు వ్యాపకాలు అధికమవుతాయి. భాగస్వామిక ఆస్తి, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన చికాకులు తొలగిపోగలవు.  
 
మకరం : వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు స్థానమార్పిడి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. 
 
కుంభం : బంధువుల రాక మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలు వాయాదిపడతాయి. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. చేపట్టి పనులు వాయిదాపడతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. 
 
మీనం : బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. స్త్రీలకు మనోవాంఛలు నెరవేరుతాయి. వాహనం నడుపుతున్నపుడు విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంసాన్ని భుజిస్తున్నట్లు కలగంటే..? (video)