Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25-06-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధిస్తే...

25-06-2020 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధిస్తే...
, గురువారం, 25 జూన్ 2020 (05:00 IST)
మేషం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విజయం మిమ్మల్ని విజయంతో ముంచెత్తుతుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తొందపాటు నిర్ణయాలు తగవు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. 
 
వృషభం : పట్టు విడవకుండా మీ యత్నాలు సాగించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పురోభివృద్ధి. సంతృప్తికానవస్తుంది. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. 
 
మిథునం : మీ అభిప్రాయాలు, మనోభావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులు తప్పవు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. చిన్నపాటి అనారోగ్యానికిగురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు అర్జిస్తారు. 
 
కర్కాటకం : వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. సహోద్యోగులు సహాయంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
సింహం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. 
 
కన్య : తాపి పనివారికి లాభదాయకంగా ఉంటుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. నిబద్ధతతో పని చేస్తే అంతా విజయమే. ఆదాయ వ్యయాలలో మీ అంచనాలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. తోబుట్టువులతో వివాదాలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
తుల : ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు పడతారు. గృహ నిర్మాణానికి ప్లాన్లు ఆమోదం. రుణాలు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ఖర్చులకు సరిపడ ధనం సమకూరుట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. 
 
వృశ్చికం : ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు : మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు. వసతి ఏర్పాట్ల విషయంలో ఒత్తిడి చికాకులు ఎదురవుతాయి. శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, దూర ప్రదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
మకరం : మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కుంభం : ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులకు సామాన్య ఫలితాలే సాధిస్తారు. 
 
మీనం : విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభార అధికమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటంగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులు తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం ఎక్కువే