Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18-07-2019- గురువారం రాశిఫలాలు - రుణ విముక్తులు కావడంతో...

18-07-2019- గురువారం రాశిఫలాలు - రుణ విముక్తులు కావడంతో...
, గురువారం, 18 జులై 2019 (09:06 IST)
మేషం : సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. పెద్దల నుంచి ఆశీర్వచనాలు లభిస్తాయి. సహోద్యోగులు, సన్నిహితులతో సమావేశం నిరాశాజనకంగా ముగుస్తుంది. ప్రముఖుల సహకారం లోపిస్తుంది. సన్నిహతులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు లభిస్తాయి.
 
వృషభం : మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. సమావేశాలలో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. హోటల్, రవాణా, ఉపాధి, వైద్య రంగాల వారికి శుభప్రదం. నిత్యావసరాలు సమకూర్చు కుంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
మిధునం : స్వతంత్ర్య నిర్ణయాలు చేసుకొనుట వల్ల శుభం చేకూరగలదు. రాజకీయ రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. మీ అభిప్రాయాలు ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. క్రయవిక్రయ రంగాల వారికి మెళుకువ అవసరం. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. రాజకీయాల్లోవారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి చికాకులు తప్పవు. భాగస్వామ్యుల మధ్య అవగాహన లోపం వల్ల చికాకులు తప్పవు.
 
సింహం : కోర్టు పనులు, లిటిగ్‌షన్లు పరిష్కారం అవుతాయి. వ్యాపార లావాదేవీలు ప్రోత్సహకరంగా ఉంటాయి. స్త్రీల ఆరోగ్యములో సంతృప్తి కానరాదు. సంఘ కార్యక్రమాలలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు చికాకులు తప్పని సరిగా ఉంటాయి.
 
కన్య : హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. మిమ్మల్ని ఉపయోగించుకొని మీ మీద అభాండాలు వేసేవారు అధికం అవుతారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. మీ అంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి.
 
తుల : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కార్యసాధనలో ఎవరి సహాయం మీకు లభించదు. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం : బ్యాంకు లావాదేవీలు, ఋణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో అనందాన్ని ఇస్తుంది.
 
ధనస్సు : సాంఘీక సమావేశాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలుస్తాయి. మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు.
 
మకరం : దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలపై దృష్టి పెడతారు. సహోద్యగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వడ్డీలు, డిపాజిట్లు చేతికందుతాయి.
 
కుంభం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్యారం అవుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యావహారాలలో జాగ్రత్త అవసరం. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తపస్సు అంటే ఏమిటి?