Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం (04-04-2018) దినఫలాలు - మీ వ్యక్తిగత భావాలకు...

మేషం : స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్

Advertiesment
బుధవారం (04-04-2018) దినఫలాలు - మీ వ్యక్తిగత భావాలకు...
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (08:32 IST)
మేషం : స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం.
 
వృషభం: ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. మీ వ్యక్తిగత భావాలకు మంచిస్ఫురణ లభిస్తుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. 
 
మిథునం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడాల్సివస్తుంది. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. లిటిగేషన్ వ్యవహారంలో జాగ్రత్త వహించండి. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కర్కాటకం: బంగారం, వెండి, లోహ రంగాల్లో వారికి మందకొడిగా ఉండగలదు. కళా, ఫోటోగ్రఫీ ఉన్నత, విద్య, విదేశ వ్యవహారాల రంగాల వారికి అనుకూల సమయం. మీ పని మీరు చేసుకుపోతారు. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటివారి సహకారం లభిస్తుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ మనస్తత్వం, పనితీరు చాలామందికి ఆశ్చర్యం, భయం కలిగిస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం అర్థిస్తారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు.
 
కన్య: స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు. గత కొంత కాలంగా కుటుంబంలోని వివాదాలు తొలగిపోతాయి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయాల్సివస్తుంది. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి.
 
తుల: మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యులలో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. 
 
వృశ్చికం: రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. రాజకీయ న్యాయ, బోధన, కళా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి.  
 
ధనస్సు: స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విదేశీ పరిచయాల వల్ల పురోగతి లభిస్తుంది. మీ మాటతీరును ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత అవసరం. 
 
మకరం: ప్రతి విషయంలోను మీ ఆధిక్యతను నిలుపుకుంటారు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో సమస్యలు, మాట పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. 
 
కుంభం: భాగస్వామిక చర్చలు ఆశాజనకంగా ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా మీ అవసరాలకు సరిపడే ధనం సర్దుబాటు కాగలదు. తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనం: పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు సంభవిస్తుంది. ప్రైవేట్ ఉపాధ్యాయులు అధిక ప్రయాసలను ఎదుర్కొంటారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పితృదోషాలను ఎలా నివృత్తి చేసుకోవాలి? కాళహస్తీశ్వరాలయంలో?