పితృదోషాలను ఎలా నివృత్తి చేసుకోవాలి? కాళహస్తీశ్వరాలయంలో?

పితృదేవతలుగా మృతిచెందిన మన పూర్వీకులకు పరిగణిస్తాం. తల్లిదండ్రులకు పెద్దలైన వారు ఈ లోకాన్ని విడిచిపోతే.. వారిని పితృదేవతలుగానే భావిస్తారు. అయితే మనం అనుభవించే సుఖదుఃఖాలు పూర్వీకులు చేసిన పాపపుణ్యాలను

మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:16 IST)
పితృదేవతలుగా మృతిచెందిన మన పూర్వీకులకు పరిగణిస్తాం. తల్లిదండ్రులకు పెద్దలైన వారు ఈ లోకాన్ని విడిచిపోతే.. వారిని పితృదేవతలుగానే భావిస్తారు. అయితే మనం అనుభవించే సుఖదుఃఖాలు పూర్వీకులు చేసిన పాపపుణ్యాలను బట్టి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పూర్వీకులు చేసిన పాపపుణ్య ఫలమే మన జీవితమని వారు చెప్తున్నారు.
 
పితృదేవతలెప్పుడు మన బాగోగుల గురించే ఆలోచిస్తారు. అలాంటివారిని పూజించడం అనేది మన కర్తవ్యం. పెద్దలను గౌరవించడం.. వారు మృతి చెందాక వారిని పూజించడం చేయడం ద్వారా శుభఫలితాలుంటాయని.. ఆనందమయ జీవితం చేకూరుతుంది. 
 
అందుకే అమావాస్య రోజున పితృదేవతలకు పూజ చేయడం తప్పనిసరి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, వారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వంటివి చేయడం ద్వారా శుభఫలితం వుంటుంది. కానీ అమావాస్య రోజున పితృపూజ చేయని వారికి అరిష్టమని పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున పితృదేవతలు తర్పణం ఇవ్వడం మానేస్తే.. వారికి వంశాభివృద్ధి వుండదని, ఈతిబాధలు తప్పవంటున్నారు.
 
అందుకే అమావాస్య రోజున చెరువు, కొలను, సముద్రంలో పుణ్యస్నానమాచరించి పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. జాతకంలో పితృదోషమున్నట్లు జ్యోతిష్యులు చెప్పినా.. పితృదోషాలు ఏర్పడకుండా వుండాలన్నా.. ఇలా చేయాల్సిందే. సంవత్సరానికి ఓసారి.. అమావాస్య రోజుల్లో పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. పూజ చేయాలి. సాధారణంగా మనకు 365 రోజులు ఓ సంవత్సరం. 
 
అయితే పితృదేవతలకు 365 రోజులూ ఒక రోజు కిందే పరిగణిస్తారు. అందుచేత ప్రతిరోజూ పితృదేవతలకు చేతనైనా అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. కాకులకు రోజు మనం చేసే వంటకాల్లో ఓ గుప్పెడు కాకులకు పెట్టాలి. ఏడాదికోసారి పితృదేవతలను మరణించిన తిథినాడు బ్రాహ్మణులను పిలిపించి తర్పణాలు, పిండప్రదానం చేయాలి. ఇలా చేయని పక్షంలో పితృదేవతలకు ఆవేశానికి గురవుతారని.. వారి ఆవేశమే.. మనకు శాపంగా పరిణమిస్తుందని పండితులు చెప్తున్నారు. అలా పితృదేవతలను పూజించకుండా వుండే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. పితృదేవతలను పూజించడం మానేసే వారు, పితృదోషాలున్నట్లు తెలియవస్తే ఇలా చేయాలి. 
 
గురుభగవానుడు రాహు, కేతువుకు చెందిన నక్షత్రంలో నిలిస్తే... లేదా గురుభగవానుడు రాహు, కేతులతో చేరి రాశిలో, నవాంశంలో నిలిస్తే పితృదోషముందని జ్యోతిష్య నిపుణులు గణిస్తారు. అందుచేత పితృదోషాలున్నవారు.. పునర్వసు, విశాఖ, ఆరుద్ర, స్వాతి వంటి నక్షత్రాల రోజున అమావాస్య వస్తే.. ఆ రోజున పూజ చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. 
 
ఇంకా మహాలయ పక్షంలో వచ్చే భరణి నక్షత్రం రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయి. మహాలక్ష పక్షంలో వచ్చే భరణి నక్షత్రాన్ని మహాభరణిగా పిలుస్తారు. అలాగే అక్షయ తృతీయ వచ్చే రోజున కూడా పితృదేవతలకు పిండప్రదానం చేయడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. 
 
మహాలయ పక్షంలో వచ్చే భరణి రోజున.. లేకుంటే పైన పేర్కొన్న నక్షత్రాల్లో వచ్చే అమావాస్య రోజున కాళహస్తీశ్వరాలయానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేయిస్తే.. పితృదోషాలు నివృత్తి అవుతాయని.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భగవద్గీతను వాళ్లేం చేసుకుంటారనీ...?