Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

Advertiesment
woman

సెల్వి

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (09:16 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యూపీలో కాబోయే అల్లుడితో ఓ మహిళ పారిపోయిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దానికంటే దారుణంగా యూపీ మహిళ తన సొంత సోదరుడి కుమారుడితో లేచిపోయింది. ఇది తెలియకుండా ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్య కనబడలేదని లబోదిబోమన్నాడు. చివరికి దర్యాప్తుతో అసలు విషయం తెలిసి షాకయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రీటా అనే మహిళ తన సొంత సోదరుడి కొడుకు మోనుతో కూడా ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయింది. ఈ ఘటన జనసత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే టిస్సాంగ్ గ్రామంలో జరుగుతుంది. రీటా వివాహం 2013లో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత, ముగ్గురు అందమైన పిల్లలు పుట్టడంతో కుటుంబం సంతోషంగా ఉందని అందరూ భావించారు. 
 
కానీ, మార్చి 19న, రీటా ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి అదృశ్యమైంది. తన భార్య కనిపించడం లేదని గ్రహించిన సోను భయపడి ఆమె కోసం అన్ని చోట్లా వెతికాడు. కానీ రీటా గురించి ఎలాంటి ఆధారాలు లేవు. వేరే మార్గం లేకపోవడంతో, అతను చివరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేశాడు. 
 
పోలీసులు తమ సాధారణ దర్యాప్తు ప్రారంభించినప్పుడే అసలు విషయం బయటపడింది. తప్పిపోయిన రీటా పొరుగున ఉన్న మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన సోదరుడి కొడుకు మోనుతోనే రీటా నివసిస్తున్నట్లు తేలింది. అయితే పోలీసులతో ఆమె మోనుతోనే వుంటానని చెప్పింది. అయితే ఆమె భర్త సోను మాత్రం పిల్లల కోసమైనా ఇంటికి వచ్చేయాలని వేడుకున్నాడు.  
 
రీటా ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు, ఆమె తనతో పాటు 40,000 రూపాయల నగదు, నగలు, ఒక ఆడ బిడ్డను కూడా తీసుకెళ్లిందని సోను తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్