Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని వేలం వేశారు..

Advertiesment
టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని వేలం వేశారు..
, బుధవారం, 17 నవంబరు 2021 (15:03 IST)
kohinoor
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.
 
18వ శతాబ్దంలో భారత్‌లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్‌ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా బ్రిటన్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు.
 
ఇక, టిప్పు సుల్తాన్‌ సింహాసనం విషయానికి వస్తే.. కిరీటం ఆభరణం అని కూడా పిలువబడే ఫినియల్ ఎనిమిది బంగారు పులి తలలలో ఒకటి, ఇది పాలకుడి సింహాసనాన్ని అలంకరించింది ఉంటుంది.. దీనిని మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్ దీని ఎగుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.. యూకే డిజిటల్, కల్చర్, మీడియా మరియు స్పోర్ట్ డిపార్ట్‌మెంట్, “£1.5 మిలియన్లకు వేలం పెట్టడంతో.. ఇది యూకే నుంచి నిష్క్రమించే అవకాశం లేకపోలేదు. 
 
కానీ, ఒక సంస్థ లేదా వ్యక్తి.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని కొనుగోలు చేయడానికి, దానిని ఎగుమతికి అనుమతించడంపై నిషేధం విధించింది. కాగా, బంగారంతో తయారు చేయబడిన ఈ సింహాసనంలో కెంపులు, పచ్చలు మరియు వజ్రాలు అమర్చారు.. 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల కళా నైపుణ్యాన్ని ఇది సూచిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుగారి కుప్పం కోట బద్ధలైంది : వైకాపా ఎంపీ విజయసాయి