Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబుగారి కుప్పం కోట బద్ధలైంది : వైకాపా ఎంపీ విజయసాయి

Advertiesment
బాబుగారి కుప్పం కోట బద్ధలైంది : వైకాపా ఎంపీ విజయసాయి
, బుధవారం, 17 నవంబరు 2021 (14:58 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటగా భావించే కుప్పం కోట బద్ధలైందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. కుప్పం మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును బుధవారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ 15 స్థానాలు గెలుచుకుంది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కుప్పం కోట బద్దలు అయ్యిందని ఆయన అన్నారు. 
 
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబును రాష్ట్రమంతటితోపాటు ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్థమైపోయిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైపూర్‌లో దారుణం : కడియాల కోసం కాళ్లు నరికేసిన దొంగలు