Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడిని పెళ్లాడేందుకు భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసిన భార్య... ఎక్కడ?

Advertiesment
Thane
, గురువారం, 16 మే 2019 (15:22 IST)
ముఖపుస్తకం ద్వారా పరిచయమైన ఓ యువకుడితో ఏర్పడిన వివాహేతర సంబంధం చివరకు కట్టుకున్న భర్తను వదిలివేసి వెళ్లాలని ఓ వివాహిత నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏకంగా భర్త సంతకాన్నే ఫోర్జరీ చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన నీలోఫర్ అనే యువతికి మస్తాన్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఈమెకు తొమ్మిదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఈమె భర్త మాత్రం బతుకుదెరువు కోసం అరబ్ దేశాలకు వెళ్లాడు. దీంతో నీలోఫర్ తన బిడ్డతో కలిసి థానేలోని ముంబ్రా ప్రాంతంలో నివాసం ఉంటుంది. 
 
అయితే, భర్త వద్ద లేకపోవడంతో సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేది. ఈక్రమలో ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికిదారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో భర్త తనకు విడాకులు ఇచ్చినట్టు అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ విడాకుల పత్రాలను సృష్టించింది. అంతేనా భర్త కొనుగోలు చేసి తన పేరిట రాసిన ఓ ఇంటిని రూ.23 లక్షలకు అమ్మేసి సొమ్ముచేసుకుంది.
 
ఇంతలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన మస్తాన్... తన భార్య ప్రవర్తనలో మార్పు కనిపించడాన్ని స్పష్టంగా గుర్తించాడు. ఆ తర్వాత భార్యలో వచ్చిన మార్పులకు కారణాలపై ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. పైగా, విడాకులు పత్రాలపై తన సంతకాలను ఫోర్జరీ చేసినట్టు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, అరెస్టు వారెంట్ జారీచేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న నీలోఫర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా థానే కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె బాంబే కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో నీలోఫర్ దోషిగా తేలిన పక్షంలో కనీసం ఏడేళ్ళ జైలుశిక్ష పడొచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోటోరోలా వన్ విజన్ మొబైల్ విడుదలైంది.. ప్రత్యేకతలేమిటి?