Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిడ్స్ ఉందని చెప్పినా విడిచిపెట్టని కామాంధుడు... ఆస్పత్రి డాబాపై రేప్

ఎయిడ్స్ ఉందని చెప్పినా విడిచిపెట్టని కామాంధుడు... ఆస్పత్రి డాబాపై రేప్
, బుధవారం, 15 మే 2019 (17:21 IST)
మహారాష్ట్రలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. తాను ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పినా ఆ కామాంధుడు వినిపించుకోకుండా 37 యేళ్ళ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ యువతి కిడ్నీ వ్యాధిబారినపడి ముంబై నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని సియాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూవస్తోంది. ఈమెకు సహాయంగా ఉండేందుకు అక్క వచ్చి ఆస్పత్రిలోనే ఉంటోంది. రోగి వద్ద ఉంటున్న మహిళపై ఓ యువకుడు కన్నేశాడు. ఆమెతో మాటామాటా కలిపి దగ్గరయ్యాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి లైంగికదాడికి ప్లాన్ చేశాడు. 
 
పైగా, తాను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్టు నమ్మించి.. ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించడమే కాకుండా పలుమార్లు ఆర్థిక సాయం కూడా చేశాడు. దీంతో ఆ కామాంధుడిని ఆ మహిళ బాగా నమ్మింది. 
 
ఈ క్రమంలో ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న విభాగంలో ఫామ్ నింపితే మందులు, చికిత్సలో రాయితీ ఇస్తారని నమ్మించిన నిందితుడు... ఆమెను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు శారీరకంగా బలహీనంగా ఉండటంతో... అతడి నుంచి తప్పించుకోలేకపోయింది. 
 
పైగా, తనకు హెచ్‌ఐవీ వ్యాధి సోకివుందని చెప్పినా ఆ కామాంధుడు వినిపించుకోలేదు. ఆమె పట్ల పశువులా ప్రవర్తిస్తూ, తన లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను అక్కడే వదిలిపెట్టి ఆ కామాంధుడు పారిపోయాడు. పిమ్మట అత్యాచార బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ పుటేజీ ఆధారంగా దీపక్‌ అన్నప్ప అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కూతురు ఫోన్ నంబరు అపరిచితుడికిస్తావా? మహిళ గొంతు కోసిన వ్యక్తి...