Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరుకు అమరావతికి అంతే దూరం.. కానీ విశాఖకు.. ఎంతో దూరం..!?

నెల్లూరుకు అమరావతికి అంతే దూరం.. కానీ విశాఖకు.. ఎంతో దూరం..!?
, బుధవారం, 25 డిశెంబరు 2019 (16:29 IST)
నెల్లూరుకు 250 కి.మీ.దూరంలో ఉన్న అమరావతిని కాదని 625 కి. మీ.దూరంలో ఉన్న విశాఖపట్నంలో రాజధాని పెట్టడము వలన, నెల్లూరు నుండి సరైన రవాణా సౌకర్యాలు లేని నెల్లూరికి 330 కి మీ దూరంలో ఉన్న కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయడము వలన నెల్లూరు జిల్లాకు ఏ విధంగా మేలు జరుగుతుందో జిల్లాకు చెందిన మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు చెప్పాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.
 
ఈరోజు ఉదయం 10 గంటలకు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాష్ట్రానికి నడి బొడ్డున ఉన్నందున, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతి ని రాజధానిగా మేము అంగీకరిస్తున్నామని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చెప్పడంతో పాటు, ఎన్నికల ప్రచార సమయంలో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుందని చెప్పడంపై ఫైర్ అయ్యారు. 
 
మేము అధికారంలోకి వచ్చినా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఏడు నెలల పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడము కోసం,ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు వినాధాన్ని ముందుకు తెచ్చారని,అదేవిధంగా తనకు తన బంధువులకు విశాఖ చుట్టుపక్కల ఉన్న భూముల విలువ పెంచుకునేందుకు విశాఖపట్నం ను రాజధానిగా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
నెల్లూరుకి అందుబాటులో ఉన్న అమరావతిని కాదని దూరంగా ఉన్న విశాఖపట్నంను రాజధాని చేయడము వలన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని, ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ నెల్లూరుకు 445 కి మీ దూరంలో ఉంటే ఇప్పుడు విశాఖపట్నం రాజధాని చేస్తే 625 దూరం ఎల్లవలసి ఉంటుందని ఏవిధంగా చూసినా విశాఖపట్నం రాజధాని చేయడము నెల్లూరు జిల్లాకు నష్టమే నని, జిల్లాకు అన్నివిధాల నష్టం జరిగే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటే  ఆ నిర్ణయాన్ని వ్యతిరీకించవలసిన జిల్లా మంత్రులు ,శాసనసభ్యులు సమర్దించి జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. 
 
కావున జిల్లాలో ఉన్న అన్ని రాజకేయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల పార్టీలకు అతీతంగా ఏకమై అందరికి అందుబాటులో ఉండే అమరావతి రాజధాని కోసం ఉద్యమించాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఏలూరు కృష్ణయ్య, శ్రీ శివుని రమణారెడ్డి, శ్రీ కావలి ఓంకార్,శ్రీ ఇందుపురు మురళీ కృష్ణా రెడ్డి,శ్రీ ఉయ్యురు వేణు,శ్రీ పాశం పరందామయ్య, శ్రీ కలికి సత్యనారాయణ రెడ్డి,శ్రీ పూల వెంకటేశ్వర్లు, శ్రీ మన్నెపల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరినీ చల్లగా చూడాలని ఆ ప్రభువును కోరుకున్నాం.. బాబు