తమిళనాడులోని అరియలూర్ జిల్లాలోని టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు పరిశ్రమ లోపలే పనిచేస్తుండటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది మంటల్లో చిక్కుకున్నారు.
మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.