Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. దసరాకు ముందుగానే బోనస్‌

Advertiesment
Sweetener
, గురువారం, 22 అక్టోబరు 2020 (05:34 IST)
2019-20 సంవత్సరానికి కేంద్రం ఉద్యోగులకు బోనస్‌ ను ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన, ఉత్పాదకేతర బోనస్‌ ను దసరాకు ముందుగానే ఇచ్చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

దీని వల్ల ఖజానాపై పడే భారం రూ.3,737 కోట్లు. రైల్వేలు, పోస్టాఫీసులు, ఈపీఎ్‌ఫవో, ఈఎ్‌సఐసీ, రక్షణ రంగాల్లో పనిచేస్తున్న 16.97 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడ్డ బోనస్‌ (పీఎల్‌బీ),  13.70 మంది ఎన్‌జీవోలకు ఉత్పాదకతతో సంబంధం లేని (నాన్‌ పీఎల్‌బీ) తాత్కాలిక బోనస్‌ లభిస్తుందని సమాచార మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారు.
 
విజయదశమిలోగా ఒకే ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ బోన్‌సను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందజేస్తామన్నారు. పండగవేళ ఉద్యోగులు ఎక్కువగా ఖర్చు చేస్తే ఆర్థికవ్యవస్థ కు ఊతమిచ్చినట్లవుతుందని ఆయన వెల్లడించారు.

కొవిడ్‌ వల్ల ఈ ఏడాది బోనస్‌ ఇస్తారో లేదో అని మధనపడ్డ ఉద్యోగులకు ఇది పండగ కానుకే! సాధారణంగా వారంరోజుల ముందే దీన్ని చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ దఫా ఆలస్యం చేయడంతో రైల్వే ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐలాండ్‌లో అరుదైన తాబేలు?!