Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహితపై మనసుపడిన శరవణ భవన్ హోటల్ యజమాని మృతి

Advertiesment
వివాహితపై మనసుపడిన శరవణ భవన్ హోటల్ యజమాని మృతి
, గురువారం, 18 జులై 2019 (14:11 IST)
తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన హోటల్ శరవణ భవన్. ఈ హోటల్ యజమాని రాజగోపాలన్. ఆయన గురువారం మృతిచెందారు. ఇటీవల ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో గురువారం కన్నుమూశారు. 
 
ఈయనకు సుప్రీంకోర్టు జీవితకారాగార శిక్షను ఇటీవలే ఖరారు చేసింది. ఈ కేసులో ఆయన ఇటీవల లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరింత ఉన్నతస్థితికి రావాలంటే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవాలని జ్యోతిష్యులు చెప్పిన మాటలను బలంగా విశ్వసించాడు. 
 
దీంతో ఆయన తన హోటల్‌లో పని చేసే ఓ వివాహితపై మనసుపడ్డారు. అయితే, ఆమెకు అప్పటికే వివాహమై ఉండటంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆమె భర్తను హత్య చేయించి, చివరకు కష్టాల్లో పడ్డారు. చివరకు ఇలా ప్రాణాలు కోల్పోయారు. 
 
జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మి... 
ఓ మారుమూల గ్రామంలో ఉల్లిపాయలు అమ్ముకుంటూ చెన్నైకు వచ్చిన వ్యక్తే ఈ హోటల్ యజమానే రాజగోపాలన్ అలియాస్ శరవణా భవన్ రాజగోపాలన్. 1981లో శరవణా భవన్ పేరుతో ఓ చిన్న రెస్టారెంట్‌ను చెన్నైలో ప్రారంభించాడు. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, అరబ్ దేశాల్లో పలు శాఖలను ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. అయితే, ఈ హోటల్ యజమాని ఇపుడు ఓ హత్య కేసులో చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. వచ్చే ఆదివారం నుంచి ఆయన శిక్ష మొదలుకానుంది. తన హోటల్‌లో పని చేస్తున్న యువతి భర్తను దారుణంగా హత్య చేయించినందుకు ఈ శిక్ష పడింది. 
 
ఈ హత్య కేసు వివరాలను పరిశీస్తే, రాజగోపాలన్‌కు అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ దఫా తన హోటల్‌లో పని చేసే అమ్మాయిపై మనసుపడ్డాడు. పైగా, ఈ అమ్మాయిని మూడో భార్యగా చేసుకుంటే అదృష్టం కలిసివస్తుందని, వ్యాపారంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ఓ జ్యోతిష్యుడు ఆయన్ను నమ్మించాడు. దీన్ని హోటల్ యజమాని గుడ్డిగా నమ్మేశాడు. 
 
అయితే, హోటల్ పనిచేసే అమ్మాయికి అప్పటికే పెళ్లి భర్త కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని రాజగోపాల్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, తన మనసులోని కోరికను చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో, రాజగోపాల్‌లోని నేరగాడు బయటకు వచ్చాడు. తనను కాదన్నదన్న కోపంతో ఆమె భర్తను 2001లో దారుణంగా చంపించాడు. 
 
దీనిపై చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు విచారణ గత 18 యేళ్లకు పైగా సాగుతోంది. ఈ కేసులో కింది కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ, రాజగోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన ధర్మాసనం, ఈ శిక్ష చాలదని, దీన్ని యావజ్జీవంగా ఖరారు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో రాజగోపాలన్ యావజ్జీవ కారాగారశిక్ష వచ్చే ఆదివారం నుంచి అమలుకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?