Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?
, గురువారం, 18 జులై 2019 (13:59 IST)
జపాన్ దేశంలో దారుణం జరిగింది. 13 మంది యానిమేషన్ ఉద్యోగులు కాలిబూడిదయ్యారు. ఓ ఉన్మాది చేసిన చర్య కారణంగా ఈ ఘోరం జరిగింది. యానిమేషన్ భవనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో మంటల్లో 13 మంది యానిమేషన్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడుని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశంపై జపాన్ పోలీసులు స్పందిస్తూ, గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదన్నారు. క్యోటో యానిమేషన్ కంపెనీ భవనం ఇంకా మండుతూనే ఉందనీ, ప్రస్తుతం 48 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన 24 గంటల్లోనే తలాక్ చెప్పేశాడు.. బైక్ కొనిపెట్టలేదట..