Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నాటక రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు!!

Prajwal Revanna

ఠాగూర్

, శనివారం, 4 మే 2024 (08:45 IST)
సార్వత్రిక ఎన్నికల సమరంలోభాగంగా, కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. మరోవైపు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వీరిద్దరూ దేశానికి ప్రధానిగా పని చేసిన హెచ్‌డీ.దేవేగౌడ కుటుంబ సభ్యులు కావటంతో ఈ కేసులు సహజంగానే ఆసక్తిగొలుపుతున్న.. బాధితులు వ్యక్తం చేస్తున్న ఆవేదన ప్రకారం వీరిద్దరి ఆగడాలు దిగ్భ్రమగొలుపుతున్నాయి. 
 
లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు, ఆ కృత్యాల చిత్రీకరణ, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌, కిడ్నాప్‌.. ఇలా కేవలం మహిళలపైనే కాదు వారి బంధువులనూ బెదిరించారన్న ఫిర్యాదులతో వీరిద్దరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) నోటీసులకు స్పందించని కారణంగా కొత్త నోటీసులు వీరికి జారీ చేశారు. వీరిద్దరి ఆగడాలకు బలైన వారిలో పని మనుషులు, విద్యార్థినులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులూ ఉండటం గమనార్హం. మహిళా అధికారులు సైతం వీరి అధికార దర్పానికి బలయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై తాజాగా నమోదైన కేసుల్లో కొందరు బాధితుల ఫిర్యాదులిలా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లి ప్రేమ వివాహం ఇష్టంలేదనీ పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు...