Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

saree pin

ఐవీఆర్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (19:48 IST)
దేశంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్న లైంగిక దాడి కేసు. అతడి బారిన పడినట్లు పలువురు బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. ఓ బాధితురాలు తనపై జరిగిన దాడిని వివరిస్తూ... రేవన్న తన భార్య ఇంట్లో లేనప్పుడు మహిళా సిబ్బందిని స్టోర్ రూముకి పిలిచేవాడు. మేము అక్కడికి వెళ్లగానే పండ్లు ఇస్తున్నట్లు నటించి తాకరాని చోట తాకేవాడు. కట్టుకున్న చీర పిన్నును తీసేసి లైంగిక దాడి చేసేవాడు" అని వెల్లడించింది.
 
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ శృంగార కుంభకోణానికి సంబంధించిన వీడియోలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండటం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా ఇపుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
గత యేడాది డిసెంబరు 8వ తేదీన బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్ పెన్ డ్రైవ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారాని ఆరోపించారు. మరో పెన్ డ్రైవ్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. రేవణ్ణతోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్