Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం : కేటీఆర్

KTR launched Sharatulu varthistaayi song

డీవీ

, సోమవారం, 11 మార్చి 2024 (19:40 IST)
KTR launched Sharatulu varthistaayi song
చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి 'తురుమై వచ్చేయ్..' లిరికల్ సాంగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ - "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. ఈ సినిమాలోని తురమై వచ్చేయ్ పాట రిలీజ్ చేశాను. ఈ పాట వినగానే నచ్చేలా ఉంది. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - మా "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా నుంచి తురుమై వచ్చేయ్ లిరికల్ సాంగ్ ను కేటీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ పాటకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడు అనేది ఈ పాటలో ఇన్ స్పైరింగ్ గా తెరకెక్కించారు. అన్నారు.
 
దర్శకుడు కుమార స్వామి మాట్లాడుతూ - ఎంతో బిజీగా ఉన్నా కేటీఆర్ గారు మాకు టైమ్ ఇచ్చారు. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా నుంచి తురుమై వచ్చేయ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం. మా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు.
 
'తురుమై వచ్చేయ్..' పాటకు పసునూరి రవీందర్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. 'తురుమై వచ్చేయ్, మెరుపే తెచ్చెయ్, తొడగొట్టి దమ్ము చూపి దుమ్ములేపెసేయ్, పదునే పెట్టేయ్, కఢరే చూపెయ్, బరిదూకి ధూమ్ తడాఖా ఆట కట్టించెయ్, జనమంతా ఆదరిస్తే, ఏలేటి ఆ గద్దె నీ విద్దె కాదా, పవరుంటె ఎవ్వరైనా తలొంచి నీ చెంత గులాము కారా..'అంటూ నిరాశ నిండిన వారిలో స్ఫూర్తినింపేలా సాగుతుందీ పాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చాక క్రౌడ్ ఫండ్ పెరిగింది : గామి నిర్మాత కార్తీక్ శబరీష్