Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాముడిని ఉత్తర భారతీయులే కొలుస్తారు.. కానీ కృష్ణుడిని..?: ములాయం సింగ్

రాముడిని కేవలం ఉత్తర భారతీయులే కొలుస్తారని ములాయం సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. టటహిందూ దేవుళ్ల‌లో రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ మంది పూజించారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాముడిని కేవ‌లం ఉత్త‌ర

Advertiesment
రాముడిని ఉత్తర భారతీయులే కొలుస్తారు.. కానీ కృష్ణుడిని..?: ములాయం సింగ్
, సోమవారం, 20 నవంబరు 2017 (17:52 IST)
రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్... ఇటీవల కన్న కుమారుడితో విభేదాల కారణంగా.. తమ్ముడికి అందలం ఇచ్చారు. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఇలా యూపీ రాజకీయాలకు కాస్త దూరంగా వున్న ములాయం సింగ్ యాదవ్.. కొత్త వివాదానికి తెరలేపారు. తద్వారా వార్తల్లో నిలిచారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధంగా వుంది. సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రాముడిని కేవలం ఉత్తర భారతీయులే కొలుస్తారని ములాయం సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. టటహిందూ 
 
దేవుళ్ల‌లో రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ మంది పూజించారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాముడిని కేవ‌లం ఉత్త‌ర భార‌తంలో పూజిస్తున్నారని.. అదే కృష్ణుడిని భార‌త‌దేశంతో పాటు విదేశాల్లో కూడా కొలిచార‌ని ములాయం అన్నారు. దక్షిణాదిలో రాముని కంటే కృష్ణుడినే ఎక్కువ పూజిస్తారని.. రాముడు దేవుడే, కానీ ఆయ‌నను కొలిచే వారికంటే ఎక్కువ మంది కృష్ణుడిని కొలుస్తార‌నే విష‌యాన్ని అంగీకరించాల్సిందేనని ములాయం నొక్కి వక్కాణించారు. 
 
దేశంలోనే కాకుండా శ్రీకృష్ణుడిని విదేశాల్లో పూజిస్తారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ములాయం సింగ్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ములాయం వార్తల్లో నిలిచేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సిఎం కిరణ్‌ తమ్ముడికి ఆ పదవి ఇచ్చేస్తున్నారా?