మాజీ సిఎం కిరణ్ తమ్ముడికి ఆ పదవి ఇచ్చేస్తున్నారా?
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత రాజకీయాల్లోకి రావడం, అందులోను తెలుగుదేశం పార్టీలోకి కిషోర్ కుమార్ రెడ్డి వెళ్ళడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే టి
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత రాజకీయాల్లోకి రావడం, అందులోను తెలుగుదేశం పార్టీలోకి కిషోర్ కుమార్ రెడ్డి వెళ్ళడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కిషోర్ కుమార్ రెడ్డి పదవులతో పాటు వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేసుకుని మరీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతేకాదు పార్టీలోకి రావడమే ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని అలంకరించబోతున్నారు కిషోర్ కుమార్ రెడ్డి.
ఈ నెల 23వ తేదీన కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే టిటిడి ఛైర్మన్ పదవిని ఆయన అలంకరించబోతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ కిషోర్ కుమార్ రెడ్డికి లభించిందట. అందుకే కిషోర్ తన అన్నతో గొడవపడి మరీ పార్టీ మారుతున్నారు. ఇన్ని నెలలుగా ఖాళీగా ఉన్న టిటిడి ఛైర్మన్ పోస్టును బాబు భర్తీ చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి వస్తున్న వ్యక్తి ఈ పదవిని కట్టబెడితే పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చ జరుగుతోంది.