Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పులు తీరిపోవాలంటే.. మంగళవారం పూట ఇలా చేయండి..

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని..

అప్పులు తీరిపోవాలంటే.. మంగళవారం పూట ఇలా చేయండి..
, సోమవారం, 20 నవంబరు 2017 (15:57 IST)
మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక  పండితులు సూచిస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని... శుచిగా స్నానమాచరించి... పూజకు అగరబత్తులు, అరటిపండ్లు, శుభ్రమైన నీరు, పువ్వులు, కుంకుమ సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
 
నిష్ఠతో హనుమాన్ యంత్రాన్ని పఠించాలి. మంగళవారం పూట శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం ముట్టకూడదు. ఐదు అరటి పండ్లను హనుమాన్‌కు సమర్పించినా చాలు. 21 మంగళవారాలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా హనుమాన్ పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో 15 నిమిషాలు హనుమంతుడిని ధ్యానించాలి. 
 
బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమల పాకులు సమర్పించి స్వామికి దీపారాధన చేయాలి. ఇలా ప్రతీ మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. సమాజంలో గౌరవం, ధైర్యం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉపాధి అవకాశాలు చేకూరుతాయి. సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు. ముఖ్యంగా పురుషులు ఈ వ్రతాన్ని చేస్తే.. అధిక నైపుణ్యం సంపాదిస్తారు. బుద్ధిబలం చేకూరుతుంది. హనుమంతుడిని శనివారం  పూజిస్తే.. శనిగ్రహదోషాలు తొలగిపోతాయి. 
 
శ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు. చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. 
 
హనుమంతునిని నిత్యం ప్రార్థిస్తే శని కూడా మన ఛాయకు రాడని పెద్దలు అంటారు. రావణుడు బ్రహ్మ శనిని లంకలో బంధించివుంచాడు. సీతమ్మ జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్కగది తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవున్ని బంధించిన గది తాళం తీస్తాడు. దీంతో శని రావణుడి నుంచి విముక్తి పొందినట్టు పురాణాలు చెప్తున్నాయి. అందుకనే అంజనీపుత్రున్ని సేవిస్తే శని నీడ మనపై పడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్ప స్వామి అష్టకంలో మార్పు..