Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

Advertiesment
Prime Minister Narendra Modi

ఠాగూర్

, బుధవారం, 7 మే 2025 (15:25 IST)
పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బంధీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలుచేసింది.
 
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్ షాక్‌కు గురికాక గుప్పలేదు.
 
బాలాకోట్ దాడి, ఆపరేషన్ సిందూర్ మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోడీ  వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోడీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.
 
బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోడీ ప్రవర్తన ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే.. దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోడీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీపీ నెట్‌వర్క్‌కు నిర్వహించిన 'ఇండియా ఎట్ 2047' సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడారు. 
 
భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్‌ను అంతకుముందు ప్రకటించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!