Fengal Cyclone ఫెంగల్ తుపాను ప్రభావం కారణంగా చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలు రద్దు చేసారు. ఐతే రద్దుకు ముందర Indigo6E విమానం ఒక దానిని విమానాశ్రయంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కాస్త స్కిడ్ అయినట్లు కనబడింది. అది గమనించిన పైలెట్ వెంటనే విమానాన్ని తిరిగి ఆకాశంలోకి తీసుకుని వెళ్లిపోయాడు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై ఎయిర్ పోర్ట్ అధారిటీ స్పందించాల్సి వుంది.