Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

Advertiesment
reporter

ఐవీఆర్

, శనివారం, 30 నవంబరు 2024 (14:56 IST)
వార్తలను యధాతథంగా కొందరు చూపించాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు పడిన ఘటనలు వున్నాయి. ఆమధ్య కేరళ వరదల్లో వాస్తవ దృశ్యాలను చూపించాలన్న తాపత్రయంలో ఓ విలేకరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దిగి రిపోర్ట్ చేసే యత్నం చేసాడు. అదృష్టవశాత్తూ పక్కనే వున్న వ్యక్తి గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
 
ఇక అసలు విషయానికి వస్తే... తమిళనాడులో ప్రస్తుతం ఫెంగల్ తుపాను తీరం దాటుతోంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ దృశ్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ విలేకరి మైకుతో పాటు గొడుగు కూడా పట్టుకుని వెళ్లాడు. ఓ మోస్తరు గాలిగే గొడుగు పైకి లేచిపోతుంది కదా. ఇక తుపాను గాలికి ఎలా వుంటుందీ... అదికాస్తా చిరిగిపోయి పైకి లేచి రెపరెపలాడుతోంది. దాన్ని అలాగే పట్టుకుని సదరు విలేకరి తుపాను ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కనిపించాడు. దీనిపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే... చొక్కాలకు నిప్పంటించుకుని పరుగులు పెడుతూ చూపిస్తారేమో అంటూ...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు